వారానికి 2రోజులు ఈ అన్నం తింటే.. చిరుతపులి లాంటి చురుకుదనం..!
Jyothi Gadda
07 December 2024
TV9 Telugu
సిరి ధాన్యాల్లో సామలు కూడా ఒకటి. సామలతో చేసిన ఆహారాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..
TV9 Telugu
సామలు తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది గ్లూటెన్ రహిత ఆహారం ఇది. పోషకాలతో నిండి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది.
TV9 Telugu
సామ బియ్యంలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి సామ బియ్యం మంచి ఎంపిక. సామ బియ్యం తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
TV9 Telugu
ఇది ఫైబర్, మెగ్నీషియం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడమే కాకుండా గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే జీర్ణ సమస్యల నయం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
TV9 Telugu
సామలు తిన్నవారిలో మలబద్ధకం వంటి సమస్యలు రావు. జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఫైబర్ చాలా అవసరం. సామల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
TV9 Telugu
ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు ప్రతి రోజూ సామలను తినడం అలవాటు చేసుకోవాలి. దీనిలో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ వల్ల త్వరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది.
TV9 Telugu
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సామలు కచ్చితంగా తినాలి. ఇది మీ గుండెకి ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెపోటు వంటివి రాకుండా ఉంటాయి.
TV9 Telugu
దీనిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.