గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకుంటే బిడ్డ చర్మం రంగు మారుతుందా?
08 July 2024
TV9 Telugu
TV9 Telugu
కుంకుమ పువ్వు గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.. ఆహారంలో ప్రత్యేక రుచి నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు దీనిని ఎన్నో రకాలుగా వినియోగిస్తుంటారు..
TV9 Telugu
అయితే పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉండాలని.. కొంతమంది గర్భిణిగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వును పాలల్లో వేసుకుని తాగుతుంటారు. అయితే నిజంగానే ఇది పుట్టబోయే బిడ్డ చర్మ ఛాయను మెరిపిస్తుందా అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి
TV9 Telugu
నిపుణులు ఏం చెబుతున్నారంటే.. కడుపులో పెరిగే బిడ్డ చర్మ రంగుకు, కుంకుమ పువ్వుకు ఎలాంటి సంబంధం లేదట. అయితే గర్భిణులు కుంకుమ పువ్వును రోజూ తీసుకోవడం మాత్రం మంచిదేనట
TV9 Telugu
గర్భిణులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే కుంకుమ పువ్వును రోజువారీ తీసుకోవాలి. అయితే వారుమాత్రం పుట్టబోయే బిడ్డ చర్మ ఛాయ మెరుగుపడాలని వారు అలా చేస్తుంటారు
TV9 Telugu
కానీ బిడ్డ చర్మ ఛాయ.. తల్లిదండ్రుల జీన్స్‌ని బట్టి ఉంటుందేతప్ప, గర్భిణీ సమయంలో తీసుకునే ఆహారాన్ని బట్టి కాదని నిపుణులు చెబుతున్నారు. గర్భం ధరించిన మహిళల్లో జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిగా సాగుతుంది. తద్వారా కొన్నిసార్లు అజీర్తి, వికారం, వాంతులు, మలబద్ధకం.. వంటి సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
కుంకుమ పువ్వు వీటన్నింటినీ దూరం చేస్తుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగినా, ఇతర ఆహార పదార్థాల్లో భాగం చేసుకున్నా సమాన ఫలితం ఉంటుంది
TV9 Telugu
అలాగే మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఒత్తిడి, ఆందోళన.. వంటి మానసిక సమస్యలు గర్భిణుల్లో సహజం. వీటిని అదుపు చేసుకొని మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవాలంటే కుంకుమ పువ్వును రోజూ తీసుకోవాలంటున్నారు నిపుణులు
TV9 Telugu
గర్భం ధరించాక తొలి త్రైమాసికంలో చాలామంది వేవిళ్లతో ఇబ్బంది పడుతుంటారు. దీన్నుంచి ఉపశమనం పొందాలన్నా కుంకుమ పువ్వు ఒక మార్గమంటున్నారు నిపుణులు. అయితే ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది