ఖాళీ కడుపుతో సబ్జా నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?

Jyothi Gadda

10 June 2024

సబ్జా గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇవి పురాతన కాలం నుండి ఆహారంలో భాగమైపోయాయి. సాంప్రదాయ వైద్యంలో కూడా వీటిని వాడేవారు. వీటిల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది.

ప్రతి రోజూ ఉదయాన్నే సబ్జా నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.  కడుపులో ఉండే యాసిడ్, గ్యాస్ వంటి సమస్యలు పరిష్కరించడంలోనూ సహాయపడుతుంది.  కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

సబ్జా గింజల్లోని ఫైబర్, జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. ఖాళీ పొట్టతో తాగడం వల్ల డయాబెటిస్ నిర్వహణకు కీలకమైన గ్లూకోజ్ ఒకే సారి విడుదలవ్వకుండా నెమ్మదిస్తుంది. 

సబ్జా గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగాలి. ఇలా చేయడం వల్ల.. ఆ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ గింజలను నీటితో కలిపి తాగడం వల్ల ఆరోగ్యకరమైన బరువు తగ్గవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సబ్జా నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సబ్జా గింజలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ , కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది.

సబ్జా గింజలో యాంటీ-అలెర్జిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొటిమలు, అలెర్జీల వంటి సమస్యల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. అంతే కాకుండా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో సబ్జా గింజల నీటిని తాగితే చర్మం స్మూత్‌గా మెరుస్తూ కనిపిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సబ్జా గింజలు గుండెపోటును నివారించడంలో, రక్తం గడ్డకట్టే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఇది వివిధ గుండె రుగ్మతలకు కూడా సహాయపడుతుంది. కాబట్టి రోజూ సబ్జా సీడ్ వాటర్ తాగండి.

సబ్జా గింజల్లోని శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, తామర వంటి చర్మ పరిస్థితుల నుంచి కాపాడతాయి. ఉదయాన్నే సబ్జా నీటిని తాగడం వల్ల చర్మానికి లోపలి నుండి పోషణ అందించడం ద్వారా స్పష్టమైన, ప్రకాశవంతమైన రంగును అందిస్తుంది.