సబ్జా గింజల వల్ల లాభాలివే.. తెలిస్తే..

Jyothi Gadda

08 December 2024

TV9 Telugu

ఇవి శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తాయి. జ్వరం వచ్చిన వారికి ఎంతో మేలు. అధిక బరువును తగ్గిస్తాయి. డైటింగ్ చేసేవాళ్లకు మేలు. 

TV9 Telugu

గ్లాస్ సబ్జా షర్బత్ తాగితే, పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. సబ్జా గింజల్లో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువ. ఇది జీర్ణ వ్యవస్థను సరిచేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది. 

TV9 Telugu

రాత్రి పడుకునేటప్పుడు గ్లాసు సబ్జా గింజల డ్రింక్ తాగితే చాలు... తెల్లారాక శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. కడుపులో మంట, ఉబ్బరం, ఆసీడిటీ, అజీర్తి లాంటి సమస్యలకు చెక్ పెడతాయి.

TV9 Telugu

డయాబెటిస్ ఉన్నవారు పంచదార వేసుకోకుండా సబ్జా వాటర్ తాగితే సమస్య కంట్రోల్ అవుతుంది. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ సెట్ అవుతాయి. 

TV9 Telugu

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన సబ్జా గింజల్ని గ్లాసు పచ్చిపాలలో వేసుకొని కొన్ని చుక్కల వెనీలా కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.

TV9 Telugu

నోట్లో వికారంగా, వామ్టింగ్ వచ్చేలా ఉంటే సబ్జా గింజల జ్యూస్ తాగాలి. సబ్జాల వల్ల గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటివి తగ్గుతాయి. 

TV9 Telugu

సబ్జా వాటర్‌లో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు. సబ్జా గింజల పానీయం వల్ల మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ E వంటి పోషకాలు లభిస్తాయి.

TV9 Telugu

సబ్జా గింజల్ని ఇతర పండ్లు, షర్బత్‌లలో వేసుకొని తాగొచ్చు, తినొచ్చు. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.

TV9 Telugu