సబ్జా నీటిని ఇలా తాగి చూడండి..ఫలితాలు చూసి షాకవుతారు..!

Jyothi Gadda

23  May 2024

సబ్జా గింజలు పోషకాల పవర్‌హౌస్. వీటిలో ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ సహా వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో సబ్జా నీటిని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం.

సబ్జా నీరు జీర్ణ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. సబ్జా గింజలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఉదయాన్నే తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

సబ్జా గింజలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. కేలరీలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

మధుమేహం ఉన్నవారు, లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకూడదని జాగ్రత్త పడేవారు సబ్జా నీరు తాగితే మంచిది. ఇది కార్భోహైడ్రేట్ల శోషణను నెమ్మదించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.

సబ్జా గింజలలో డిటాక్సిఫైయింగ్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్లను మూత్రం గుండా వెళ్లిపోయేలా చేస్తాయి. ఖాళీ కడుపుతో సబ్జా నీరు తాగితే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

సబ్జా గింజలలో ఉండే విటమిన్లు, మినరల్స్, యంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. శరీరంలో వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి.