రోజ్​వాటర్‌ను రోజూ వాడుతున్నారా..? ఏమౌతుందో తెలుసా..?

Jyothi Gadda

28 October 2024

స్కిన్ కేర్,మేకప్ ఇప్పుడు ఎంత సహజమైనవి అయితే అంత బావుంటుంది.అలాంటి ప్రోడక్ట్స్ లో ఒకటి రోజ్ వాటర్. బ్యూటీ ఇన్‌గ్రీడియెంట్ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ బ్యాలెన్సింగ్ చేస్తుంది.

రాత్రి నిద్రపోయే ముందు చర్మానికి రోజ్‌వాటర్‌ను అప్లై చేస్తే, తేమ పోయి స్కిన్‌ మెరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి రక్షణగా ఉంటుంది. చర్మం మృదువుగా అవుతుంది.

ఎర్రగా మారిపోయి, ఇరిటేట్ అయిపోయి ఉన్న స్కిన్ ని కూల్ డౌన్ చేయాలంటే రోజ్ వాటర్ మంచి పరిష్కారం. యాక్నే, ఎలర్జీల కారణంగా స్కిన్ ఎర్రగా అవుతుంటే రోజ్ వాటర్ వాడొచ్చు.

సున్నితమైన గులాబీ రేకుల నుంచి తయారుచేసే రోజ్ వాటర్ సహజ సౌందర్యాన్ని పెంపొందించి చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా తయారయేలా చేస్తుందని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది.

రోజ్‌వాటర్‌లో సమృద్ధిగా ఉండే హైడ్రేటింగ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నందున ఇవి దద్దుర్లు, చికాకులు వంటి వాటికి సహజ నివారణగా పనిచేస్తుంది.

మంచి సువాసన కలిగి ఉండే రోజ్ వాటర్ ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని దూరం చేసి మానసిక స్థితిని కూడా మెరుగ్గా మార్చుతుంది. చర్మంపై ఉండే అదనపు నూనెలు, మలినాలను తొలగిస్తుంది.

రోజ్ వాటర్ సహజమైన యాంటీ ఏజింగ్ సాధనంగా పనిచేస్తాయి. అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్​తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి.

పొడిగా, నిర్జీవంగా కనిపించే చర్మం ఉన్నవారికి రోజ్ వాటర్ చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. చర్మానికి తేమను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.