వెనక్కి నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వల్ల కార్డియో శ్వాసకోవ ఆరోగ్యం మెరగవుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గి ఊపిరితిత్తులు బలంగా మారతాయి.
మానసిక ఆరోగ్యానికి కూడా రివర్స్ వాకింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గి, మానసికంగా చాలా రిలాక్స్ అవుతారని నిపుణులు చెబుతున్నారు.
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు రివర్స్ వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కీళ్ళు బలంగా మారి నొప్పులు తగ్గుతాయని అంటున్నారు
రివర్స్ వాకింగ్ చేయడం వల్ల కాళ్ళు, తొడల కండరాలు మరింత ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. దీనివల్ల తొడలు బలంగా మారి కాళ్ల నొప్పులు తగ్గుతాయి.
త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా రివర్స్ వాకింగ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మాములు వాకింగ్‌తో పోల్చితే రివర్స్ వాకింగ్ ద్వారా వేగంగా కేలరీలు బర్న్ అవుతాయి.
నడుము నొప్పితో బాధడపేవారికి కూడా రివర్స్ వాకింగ్ చేస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజు 15 నిమిషాలు నడిస్తే నడుం నొప్పి తగ్గిపోతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.