రిలేషన్‌షిప్‌లో అబద్దం కూడా మంచిదే.. బంధం డబుల్ స్ట్రాంగ్‌గా మారాలంటే..

17 April 2024

Shaik Madar Saheb

రిలేషన్‌షిప్‌లో.. భాగస్వామితో సంతోషంగా జీవితాన్ని గడపాలంటే నిజాయితీ చాలా ముఖ్యం.. అయితే దీని అర్థం ఎప్పుడూ నిజం మాట్లాడాలని.. సంతోషం కోసం అబద్ధం కూడా చెప్పమని..

కొన్నిసార్లు, సంబంధాన్ని బలోపేతం చేయడానికి, భావాలను దెబ్బతీయకుండా ఉండటానికి "చిన్న అబద్ధం" చెప్పడం అవసరం.

అయితే ఈ అబద్ధాలు తప్పును దాచిపెట్టడానికి కాకూడదు ప్రేమను, ఆనందాన్ని పంచడానికి అని గుర్తుంచుకోవాలి. 

రిలేషన్‌షిప్‌లో చెప్పే కొన్ని అబద్ధాలు సంబంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయని ఒక అధ్యయనంలో కనుగొన్నారు.

మీ సంబంధం బాగుండాలంటే.. కొన్ని ఆరోగ్యకరమైన అబద్ధాలనే ఎంచుకోవాలి.. అంటే మీ భాగస్వామిని సంతోషపెట్టేది అయి ఉండాలి..

ప్రతి ఒక్కరూ తమ భాగస్వామికి అందంగా కనిపించాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి బాగున్నావంటూ కితాబివ్వండి..

మీ భాగస్వామి చెప్పే ప్రతిదానితో మీరు ఏకీభవించనప్పటికీ.. సరైనది అయినప్పుడల్లా వారి అభిప్రాయాన్ని ప్రశంసించండి. 

మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఎప్పుడూ సంకోచించకండి. ఏళ్లు గడిచినా.. గొడవలున్నా..ఇది మాత్రం మానొద్దు..

ప్రేమ, ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే ఈ అబద్ధాలను ఉపయోగించండి. మోసం చేయడానికి ఉపయోగించవద్దు.