దాదాపు ప్రతి వంటలో ఉల్లి పాయలు వాడుతుంటాం. ఉల్లి వంటలకు ప్రత్యేక రుచిని తీసుకువస్తుంది. అందుకే ఏ కూర చేసినా అందులో ఒక ఉల్లిగడ్డ వేయాల్సిందే.
ఉల్లి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్‌లో మనం కొనే ఉల్లిగడ్డల్లో ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లిగడ్డ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి
మరి వీటిల్లో ఏ రంగు ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం అనే సందేహం చాలామందికి వస్తుంది. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
నిజానికి ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిలోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్ల ఉల్లిలో ఉల్లిపాయలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి
వీటితోపాటు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియెంట్ కూడా ఉల్లిలో పుష్కలంగా ఉంటాయి
తెల్ల ఉల్లిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల ఉల్లి గుండెను ఆరోగ్యంగా, ఫిట్‌గా కూడా ఉంచుతుంది
ఎర్ర ఉల్లిపాయలో తెల్ల ఉల్లియాలో కంటే తక్కవ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి శ్వాస సంబంధించిన సమస్యలను సైతం దూరం చేస్తాయి
ఉల్లి గడ్డలను పచ్చిగా లేదా ఉడికించి ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తెల్ల ఉల్లిగడ్డలను వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు