‘మఖానా’గా పిలుచుకునే 'తామర' గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి
TV9 Telugu
అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకుంటే.. మరికొందరు వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఎలా తీసుకున్నా.. మంచిదే
TV9 Telugu
మఖానాలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి
TV9 Telugu
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం.. ఎముకలు, దంతాల్ని దృఢంగా మారుస్తాయి. ఐరన్ రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది
TV9 Telugu
మఖానాలో సోడియం తక్కువ.. పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
రుచిగా చేసుకోవాలంటే.. మఖానాను నెయ్యిలో వేయించి, దాని రుచిని పెంచడానికి కాస్త ఉప్పు, కారం చల్లుకుంటే రుచి అదిరిపోద్ది. నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి
TV9 Telugu
అలాగే ఇందులో విటమిన్లు A, D, E, K వంటి అవసరమైన పోషకాలు ఉంటంఆయి. మఖానా లేదా తామర గింజలను నెయ్యిలో వేయించి తింటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది
TV9 Telugu
నెయ్యిలో వేయించిన మఖానా తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది. బరువును నియంత్రించాలనుకునే వారికి నెయ్యిలో వేయించిన మఖానా తినడం అద్భుతమైన ఎంపిక