మహిళలూ ఇవి తినొద్దు.. కొబ్బరి బోండంలా ఊరిపోతారు!

February  25, 2024

TV9 Telugu

ఇంటిల్లిపాదినీ చక్కబెట్టి ఉరుకులు పరుగులు తీసే గృహలక్ష్ములు ఏం తింటారో, ఎప్పుడు తింటారో వారికే తెలియదు. ఒక్కోసారి తినడమే మానేస్తుంటారు. ఇలా ఎక్కువ కాలం వేళాపాళా లేకుండా తినడం మొదటికే మోసం తేస్తుందట

ఇలా వేళ తప్పి తినడం వల్ల జంక్‌ఫుడ్‌ మీదకు మనసు మళ్లేలా చేస్తుందట. ఫలితంగానే అజీర్తి, మలబద్ధకం, గ్యాస్‌, బరువుపెరగడం వంటి సమస్యలన్నీ పుట్టుకొస్తాయి

ఇలా జరగకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇతర ఆహారాలతో పోలిస్తే కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది

అధిక కొవ్వు పదార్థాలు గ్యాస్‌, ఉబ్బరం, మలబద్ధకాలకి కారణమవుతాయి. అందుకే వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటమే మంచిది. బదులుగా ఆరోగ్యకరమైన కొవ్వులు దొరికే పదార్థాలను తీసుకోవాలి

నట్స్‌, సీడ్స్‌, గుడ్లు, బీన్స్‌, చేపలు వంటి ఆహారాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కారంగా ఉన్న పదార్థాలు రుచికి భలేగున్నా.. వీటిని అతిగా తింటే జీర్ణాశయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి

ఇవి పొట్ట, పేగు లైనింగ్‌పై ప్రభావం చూపి డయేరియా, కడుపులో మంట, నొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే స్వీట్లూ, కృత్రిమ స్వీటెనర్లు ఉన్న పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదు

ఇందులో చక్కెరతో పాటు కెలొరీల మోతాదూ ఎక్కువగా ఉంటుంది. ఇవి పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీసి, జీర్ణ ఆరోగ్యానికి ముప్పు తలపెడతాయి

ఫలితంగా గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి జీర్ణసమస్యలు రావచ్చు. బేకరీ ఐటెమ్స్‌ ప్రాసెస్‌ చేసిన పిండితో ఎక్కువగా చేస్తారు. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే శరీరంలో చెడు కొలెస్టాల్ర్‌ పెరిగిపోయి, టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తుంది