07 March 2024

బరువు పెరగడానికి ఇది కూడా కారణమే.. 

TV9 Telugu

సాధారణంగా బరువు పెరగడానికి తీసుకునే ఆహారమనే భావనలో ఉంటారు. అయితే ఇందులో నిజం ఉన్నా ఇదే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. 

బరువు పెరగడానికి నిద్రలేమి కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమీ కారణంగా అతిగా తినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

ఇక మోనోపాజ్‌ దశలో ఉన్న స్త్రీలు కూడా ఉన్నపలంగా బరువు పెరుగుతారు. శరీరంలో ఈస్ట్రోజన్‌ స్థాయిల్లో వచ్చే మార్పులు బరువు పెరిగేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఉన్నట్లుండి బరువు పెరగడానికి కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వాపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. 

ధైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కూడా ఉన్నపలంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. హైపోథైరాయిడిజం బరువు పెరగడానికి కారణమవుతుంది. 

ఇక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా విడుదలైన హార్మోన్ల వల్ల బరువు పెరుగుతారు. 

ఇక జంక్ ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే సహజంగానే బరువు పెరుగుతారనే విషయం తెలిసిందే. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.