విద్యార్థులకు నీలం, నలుపు.. ఉపాధ్యాయులకు ఎరుపు పెన్నులు ఎందుకు..?

17 December 2023

తరచుగా పాఠశాలల్లో విద్యార్థులు నీలం, నలుపు పెన్నులను ఉపయోగిస్తుంటారు. అదే సమయంలో, చాలా మంది ఉపాధ్యాయులు ఎరుపు పెన్ను ఉపయోగిస్తారు.

పాఠశాలలో చదివే పిల్లలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. కొన్ని నియమాల ప్రకారం విద్యార్థుల అధ్యయనం జరుగుతుంటుంది.

విద్యార్థి దశ ప్రారంభంలో పిల్లలకు పెన్సిల్‌తో రాయడం నేర్పుతారు. తప్పులు దొర్లితే సరిదిద్దేందుకు వీలవుతుంది.

నిర్దిష్ట వయస్సు, తరగతి తర్వాత వారు నీలం లేదా నలుపు సిరా పెన్నులతో రాయడానికి అనుమతిస్తారు. విద్యార్థులు తెల్ల కాగితంపై వ్రాయడానికి బ్లూ, బ్లాక్ పెన్నులను వాడుతుంటారు.

తెలుపు రంగుపై నీలం, నలుపు రంగువిరుద్ధమైన రంగులు. అందుకే కాగితంపై స్పష్టంగా కనిపించడానికి వాడుతుంటారు.

నీలం, నలుపు రంగులలోని ఉన్న అక్షరాలు భిన్నంగా కనిపిస్తాయి. పదాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది.

లైట్ ఇంక్ పెన్ను ఉపయోగిస్తే అక్షరాలు చదవడానికి చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థుల రాతలలోని తప్పులను సరిదిద్దేందుకు ఉపాధ్యాయులు రెడ్ పెన్ను ఉపయోగిస్తారు.

ఉపాధ్యాయుడు కూడా నీలం లేదా నలుపు పెన్నును ఉపయోగిస్తే, విద్యార్థులు రాసే దానికి మధ్య వ్యత్యాసం తెలియదు.