రోజూ ఒక పచ్చి వెల్లుల్లి తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ తెలుసా..?
Jyothi Gadda
09 October 2024
పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉదయం పచ్చి వెల్లుల్లి నమలడం వల్ల అధిక రక్తపోటు సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది.
తరుచు జలుబు , దగ్గు, ఫ్లూ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారికి మంచిది.
కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను తొలగించడంలో మేలు చేస్తుంది. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వెల్లుల్లిని సలాడ్‌లు, సూప్‌లు, కూరగాయల వంటకాలు, చట్నీలు మొదలైన వాటిలో చేర్చి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.
వెల్లుల్లిలోని వివిధ రసాయనాలకు ఆరోగ్యకరమైన కణాల మీద దాడిచేసే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను నిర్మూలించే సత్తా ఉన్నదని పరిశోధకులు గుర్తించారు.
వెల్లుల్లిని పేస్ట్ లేదా పూతగా తయారు చేసి రొట్టె లేదా ఇతర ఆహార పదార్థాలపై రాసుకోవచ్చు. దీని ఎండబెట్టి పొడిగా చేసి, అవసరమైనప్పుడు ఆహారంలో చేర్చవచ్చు.
వెల్లుల్లిలోని గుణాలు చర్మంపై మొటిమలు, కురుపులు లాంటి వాటిని పోగొట్టే శక్తి దానికి ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ మధుమేహం, అల్జీమర్స్, హృదయ వ్యాధుల్ని దూరం నివారిస్తుంది.