వీరు పొరపాటున కూడా పచ్చి వెల్లుల్లి తినకూడదు.. ఆరోగ్యానికి హానికరం 

27 June 2024

TV9 Telugu

Pic credit - pexels

యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉన్న వెల్లుల్లి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్మకం. ఆయుర్వేదంలో వెల్లుల్లిని సౌధంగా ఉపయోగిస్తారు. అయితే వీటిని పచ్చిగా తినాలా వద్దా? తెలుసుకుందాం. 

వెల్లుల్లి లక్షణాలు

సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తినేస్తున్నారు. అయితే ఇలా చేయడం వలన ఆరోగ్యానికి మంచిదా.. లేక ప్రతికూలత ఉందా నిపుణులు ఏమి చెప్పారంటే తెలుసుకుందాం.

పచ్చి వెల్లుల్లి తీసుకోవడం 

జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ వెల్లుల్లి ప్రయోజనం శరీర స్వభావంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

శరీర స్వభావం

పచ్చి వెల్లుల్లిని తినడానికి చలికాలం సరైన సమయమని కిరణ్ గుప్తా చెప్పారు. వేసవిలో పచ్చి వెల్లుల్లిని మింగడం లేదా నమలడం చేయాలంటే నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే చేయండి.

ఏ సీజన్ ఉత్తమం అంటే 

ఎవరైనా ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతుంటే.. పచ్చి వెల్లుల్లిని తినకూడదు. నిపుణుడు కిరణ్ గుప్తా మాట్లాడుతూ ఇలాంటి జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గే బదులు పెరుగుతాయని చెప్పారు.

ఎసిడిటీతో బాధపడేవారు 

కొంతమంది వెల్లుల్లిని హోం రెమెడీగా యూజ్ చేస్తూ స్కిన్ పై రుద్దుతారు. ఇలా చేయడం వలన స్కిన్ అలర్జీ బారిన పడవచ్చు అని చెబుతున్నారు. 

స్కిన్ అలర్జీ

పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర అసౌకర్యాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు దూరంగా ఉండడం మంచిది 

జీర్ణ సమస్యలు

వెల్లుల్లిలో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉన్నాయి.ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.

శస్త్రచికిత్స సమయంలో