11 June 2024
TV9 Telugu
Pic credit - pixabay
పండ్లలో రారాజు మామిడి పండు అని అందరూ చెబుతుంటారు. అయితే పండ్లలో రాణి ఎవరో తెలుసా? దీనికి సమాధానం తెలుసుకోండి.
ఇది మీకు షాకింగ్‌గా అనిపించినప్పటికీ.. పండ్లకు రాణి అంటే ఆలోచిస్తారు పండ్లకు రాణి కూడా ఉందని కొందరికి మాత్రమే తెలుసు..
ఆగ్నేయాసియాలో మాంగోస్టీన్‌ను పండ్ల రాణి అని పిలుస్తారు. మాంగోస్టీన్ పండు థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
మాంగోస్టీన్ థాయిలాండ్ జాతీయ పండు. బ్రిటన్ రాణి విక్టోరియాకు ఈ పండు అంటే చాలా ఇష్టం. దీనిని హిందీలో మంగుస్తాన్ అంటారు.
మాంగోస్టీన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి
ఊదా రంగులో ఉండే ఈ పండులో పైభాగంలోని గట్టి భాగాన్ని తీసివేసి లోపల ఉన్న తెల్లటి గుజ్జు భాగాన్ని తింటారు. అయితే ఈ పండుని ఎక్కువసేపు బహిరంగ ప్రదేశంలో ఉంచవద్దు.
మాంగోస్టీన్ పండుని ఎక్కువసేపు బహిరంగ ప్రదేశంలో ఉంచినట్లయితే.. అది నీరుగా మారడం, పై చర్మం గట్టిగా మారడం ప్రారంభమవుతుంది.
మాంగోస్టీన్ పండు సాధారణంగా గర్భిణీ లేదా అనారోగ్యంతో ఉన్న మహిళలకు సూచించబడదు. పండు తినే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.