వేడుక ఏదైనా ఇంటిళ్లిపాదీ పట్టు వస్త్రాలు ధరించడం ఆనవాయితీ. పట్టు వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనం, అందం ఇట్టే ఉట్టిపడుతుంది. ముఖ్యంగా శుభకార్యాల్లో పట్టువస్త్రాలు తప్పనిసరిగా ధరిస్తారు
మార్కెట్లో పట్టు వస్త్రాలకు మంచి ధర ఉండటంతో షాపుల్లో నకిలీ పట్టు వస్త్రాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయ్.. అసలు పట్టు, నకిలీ పట్టు గుర్తించడం కూడా అంత సులువేంకాదు
దీంతో వస్త్ర దుకాణాదారులు వినియోగదారుడిని సులువుగా బురిడీ కొట్టించేస్తుంటారు. మరైతే ఎలా అసలు పట్టును గుర్తించేది అనుకుంటున్నారా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఇట్లే కనిపెట్టేయొచ్చు
పట్టులో అనేక రకాలున్నాయి. అందులో సహజసిద్ధమైనది మల్బరీ సిల్క్. పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలన్నీ మల్బరీ పట్టుతోనే తయారవుతాయి. ఇక కాపర్‌రంగులో ఉండే ‘టస్సార్ సిల్క్’, ‘ఈరీ సిల్క్’, ‘ముంగా పట్టు’ వంటి ఎన్నో రకాల పట్టు లభ్యమవుతున్నాయి
నకిలీ పట్టును ఎలా గుర్తించాలంటే.. పట్టు పోగుని వెలిగించినప్పుడు నిరంతరంగా కాలకుండా వెంటనే ఆరిపోతుంది. అలాగే పట్టును కాల్చినప్పుడు వెంట్రుకలు, ఈకలు కాలిన వాసన వస్తుంది
పట్టు పోగు చివరలో చిన్న నల్లపూసలా కనిపిస్తుంది. ఆ పూసను నలిపినప్పుడు పొడిగా రాలి పోగు గరుకుగా మారుతుంది. ఇలా అసలైన పట్టు ఏదో, నకిలీ పట్టు ఏదో గుర్తించవచ్చు
అందుకే పట్టు వస్త్రాలను ఎల్లప్పుడు సిల్క్‌మార్క్ అధీకృత షాపుల్లోనే కొనుగోలు చేయాలి. సిల్క్‌మార్క్ లేబుల్ ఉన్న పట్టు వస్త్రాలు నూటికి నూరు శాతం పట్టు ప్రామాణికతను సూచిస్తుంది
స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్ ఉంటుంది. అదే మగ్గంపై నేసిన పట్టు వస్త్రాలకైతే హ్యాండ్లూమ్ మార్క్ వేసి ఉంటుంది