గుమ్మడి గింజల ఆరోగ్య రహస్యం.. తెలిస్తే వదిలిపెట్టరు
26 August 2024
TV9 Telugu
TV9 Telugu
గుమ్మడి కాయ తింటే మంచిదని తెలుసు గానీ, అందులోని గింజలకూ ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం చాలామందికి తెలియదు. కానీ, ఈ మధ్య సూపర్‌ఫుడ్‌గా వీటిని రోజూ ఓ చెంచా తినమని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువ. జీర్ణసంబంధిత సమస్యలూ, అధికబరువు... వంటివాటితో బాధపడేవారు రోజూ ఓ చెంచా గింజల్ని తినండి. వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది
TV9 Telugu
దీంతో అతిగా ఆహారం తినే అలవాటుని నియంత్రిస్తుంది. ఫలితంగా బరువూ తగ్గుతారు. అలానే జీర్ణ ప్రక్రియనూ మెరుగుపరుస్తుంది. అందేరూ ఈ మధ్య కాలంలో గుమ్మడికాయల వినియోగం ఆరోగ్య స్పృహలో ఎక్కువైంది
TV9 Telugu
గుమ్మడికాయ విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంచడంలో గుమ్మడికాయ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది
TV9 Telugu
గుమ్మడికాయ గింజలలో కాల్షియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బోలు ఎముకల వ్యాధి నివారించడంలో సహాయపడతాయి
TV9 Telugu
గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది ఆక్సిటోసిన్ హార్మోన్, మెలటోనిన్, సెరోటోనిన్ విడుదలలో సహాయపడుతుంది. ఫలితంగా మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది
TV9 Telugu
గుమ్మడి గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, సల్ఫర్, జింక్, విటమిన్ ఎ, బిఆర్‌కె పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును మెరిసేలా, ఒత్తుగా మార్చడంలో సహాయపడతాయి
TV9 Telugu
గుమ్మడి గింజల్లో సెరోటోనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా నిద్రలేమి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది