జుట్టు రాలడాన్ని చిటికెలో నివారించే గుమ్మడి గింజలు.. ఎలా వాడాలంటే
17 July 2024
TV9 Telugu
TV9 Telugu
ఒత్తైన పొడవాటి జుట్టు కావాలని ఎవరు కోరుకోరు. అందుకు మార్కెట్లో రకరకాల షాంపూలు, కొన్నిసార్లు ఖరీదైన హెయిర్ మాస్క్‌లను కూడా ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ అకారణంగా జుట్టురాలిపోతూ ఉంటుంది
TV9 Telugu
చివరికి ఇంట్లో తయారుచేసిన నూనెలు వాడినా జుట్టు రాలడం ఆగదు. అయితే జుట్టు సమస్యల నుంచి బయటపడటానికి సౌందర్య సాధనాలను మార్చాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చుకుంటే చాలని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
జుట్టు సమస్యలకు గుమ్మడి విత్తనాలు బలేగా పనిచేస్తాయి. జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. గుమ్మడి గింజలలో విటమిన్ ఎ, బి మరియు సి, ఐరన్, ప్రొటీన్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఫాస్పరస్ వెంట్రుకలకు మేలు చేస్తాయి
TV9 Telugu
గుమ్మడి గింజలు స్కాల్ప్ ను తేమగా ఉంచుతాయి, ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. జుట్టు కుదుళ్లకు పోషణ అందించి చివర్లు చీలిపోయే సమస్యను కూడా దూరం చేస్తుంది
TV9 Telugu
గుమ్మడి గింజలు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్ ఇ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
TV9 Telugu
గుమ్మడి గింజలు స్కాల్ప్, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుమ్మడి గింజల నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి
TV9 Telugu
మీ రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చుకోవడం వల్ల జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. గుమ్మడికాయ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
TV9 Telugu
గుమ్మడి హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. గుమ్మడి గింజల పొడి, తేనె, కొబ్బరి నూనె, పెరుగుతో చేసిన హెయిర్ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు