గుమ్మడి కాయ కచ్చితంగా తినండి..
Narender Vaitla
18 November
2024
గుమ్మడి కాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పక్షవాతం ముప్పు తగ్గిస్తుంది.
గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా గుమ్మడి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా గుమ్మడి కాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గుమ్మడి కాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా గుమ్మడి కాయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని సెరటోనిన్ మంచి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది.
గుమ్మడి కాయలో బీటా కెరొటిన్‌తో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..