మరమరాలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

April 04, 2024

TV9 Telugu

మరమరాలను వివిధ ప్రాంతాల్లో బొరుగులు, ముర్ముర్లు, మురీలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లిష్‌లో పఫ్డ్‌ రైస్ అని అంటారు. చాలా ఇళ్లల్లో వీటిని బెస్ట్‌ స్నాక్‌ ఐటమ్‌గా తింటుంటారు

ముఖ్యంగా వీటితో చేసే లడ్డూలు, భేల్ పూరి, స్వీట్స్‌ చాలా బాగుంటాయి. అయితే ఇలాంటి మరమరాలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చాలా మందికి తెలియదు

ఇది బెస్ట్‌ టైమ్‌ పాస్‌ ఫుడ్‌ స్నాక్‌ మాత్రమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. మరమరాలలో విటమిన్‌ డి, విటమిన్‌ బి, క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

ఇవి చాలా తేలికైన ఆహారం. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల మరమరాలలో 17 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. వీటిని రోజూ స్నాక్‌గా తీసుకోవచ్చు

మరమరాలలో విటమిన్‌ డి, బిలతో పాటు కాల్షియం, ఐరన్‌, థయామిన్, రిబోఫ్లావిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మార్చడమేకాకుండా ఆస్టియోపొరోసిస్‌ ముప్పును తగ్గిస్తాయి

వీటిల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పైగా ఎక్కువ సమయం ఆకలిని నియంత్రించి కడుపు నిండిన భావన కలిగిస్తుంది. బరువు తగ్గేవారికి మరమరాలు బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పొచ్చు

మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటిల్లో సోడియం శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉప్పు ఉండదు కాబట్టి బీపీ పెరుగుతుందనే భయం ఉండదు

మరమరాలు పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. నీటిలో నానబెట్టి కాస్త మెత్తబడ్డాక తింటే జీర్ణసమస్యలు దరిచేరవు. జీర్ణర సమస్యలతో బాధపడేవారు వీటిని భేషుగ్గా తినొచ్చు