ప్రోటీన్ లోపం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.. 

11 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, శారీరక సరైన అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. శరీరంలో ప్రొటీన్ లోపం ఉంటే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. 

ప్రోటీన్ ముఖ్యం

ప్రోటీన్ లోపం, లక్షణాలు విటమిన్ B12 లోపంతో సమానంగా ఉంటాయి. జుట్టు ఊడిపోవడం, కండరాల నొప్పి, ఎముక సమస్యలు,పెరిగిన ఆకలి వంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి. 

లోపం ఉంటే లక్షణాలు

ప్రొటీన్లు లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ చెప్పారు. దీంతో వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం

నిపుణులు ఏమన్నారంటే 

గుడ్లు కాల్షియంతో సమృద్ధిగా ఉండటమే కాకుండా ప్రోటీన్ అద్భుతమైన మూలకం కూడా.. కనుక రోజూ కనీసం ఒక గుడ్డు తినండి

గుడ్లు

ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కోవడంలో పాల ఉత్పత్తులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. పనీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు  తక్కువగా ఉంటాయి.

చీజ్

మనం ఎక్కువగా సోయాబీన్స్, పప్పులు, శనగలు, బీన్స్ తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ప్రొటీన్ లోపం తొలగిపోతుంది. ప్రతిరోజూ ఒక గిన్నె పప్పులను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

పప్పులు

బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫూట్స్ తినడం వల్ల పుష్కలంగా శక్తిని అందిస్తాయి. ప్రోటీన్స్ కూడా ఉంటాయి. మీ శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి.

డ్రై ఫూట్స్