సాధారణంగా శీతాకాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీని వల్ల శరీరానికి సరిపడా నీళ్లు అందక అనేక సమస్యలు పుట్టుకొస్తాయి
ముఖ్యంగా ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. అంటే శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోవడం వల్ల ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతాయి
పెద్దవాళ్లలో ఈ సమస్యని గుర్తించడం తేలికే. కానీ చిన్నపిల్లల్లో ఉండే డీహైడ్రేషన్ తెలుసుకోవడం అంత సులువు కాదు. ఆటపాటల్లో పడి పిల్లలు తగినన్నీ నీళ్లు తాగరు
వాతావరణం చల్లగా ఉందనో, స్కూల్లో తరచూ టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుందనో సరిగా నీళ్లు తాగరు. దీంతో పిల్లలు డీహైడ్రేషన్ బారినపడుతుంటారు
పిల్లల పెదాలు ఎండిపోయినట్టుగా కనిపించినా, పెదాలు పగిలినా అది డీహైడ్రేషన్‌కు సంకేతం అని గుర్తించాలి. పిల్లలు నీళ్లు తాగకపోతే పెద్దలే గుర్తుచేసి మధ్యమధ్యలో నీళ్లు తాగిస్తుండాలి
మరో సంకేతం.. మూత్రవిసర్జనకి వెళ్లకపోవడం. పిల్లల్లో ఈ లక్షణం కనిపిస్తే వాళ్లు నీళ్లు సరిగా తాగడం లేదని అర్థం. అలాగే మూత్రం రంగు మారినా జాగ్రత్తపడాలి
పిల్లల్లో డీహైడ్రేషన్ సమస్య తీవ్రమైతే నీరసం, చికాకుగా ఉంటారు. చిన్న చిన్న పనులు చేసినా అలసిపోయి, చదువుమీద ఏకాగ్రత పెట్టలేరు
అశ్రద్ధ చేస్తే పిల్లలు కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. ఆహారంలో కూరగాయలు, పండ్లు తప్పక ఉండేలా చూడాలి. దాహం వేసినా, వేయకపోయినా నీళ్లు తాగడం అలవాటు చేయాలి