ఓటరు గుర్తింపు కార్డు క్షణాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోండిలా !

18 October 2023

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది.

ఆఫీసియల్ వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేయడంతో మొబైల్‌ నంబరుతో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందచ్చు.

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం ఆఫీసియల్ వెబ్‌సైట్‌లో రూపొందించిన ఫార్మ్‌-8నే వాడాల్సి ఉంటుంది.

మీ మొబైల్‌ నంబరు నమోదుకు ప్రత్యేక కాలమ్‌పై క్లిక్‌ చేసి నమోదు చేసిన తరవాత దరఖాస్తును సబ్‌మిట్‌ చేయాలి.

ఆ తరవాత ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. వెంటనే ఏ మొబైల్‌ నంబరు నమోదుచేశామో, ఆ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.

మీ మొబైల్ నెంబర్ ను నమోదు చేసి ఎంటర్ చేయగానే మీకు కావలసిన ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్‌ అవుతుంది.

ఈ చేయడం వల్ల ఎన్నికల సంఘం పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.

ఇంకెందుకు ఆలస్యం voters.eci.gov.in అనే ఆఫీసియల్ వెబ్‌సైట్‌ ద్వారా మీ కావాల్సిన ఈ ఓటర్ ఐడిని సులభంగా సంపాదించుకోండి.