06 September 2023

ఈ మొక్కలతో ఇంట్లోకి దోమలు రాకుండా నివారించండి   

వర్షాకాలంలో  ఎక్కువయ్యే దోమల బెడద  అనేక వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. 

దోమలను తరిమికొట్టేందుకు కాయిల్స్‌, స్ప్రేలు, లిక్విడ్‌ వేపొరైజర్లు వాడతాం. కానీ వీటిలోని రసాయనాలు  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి.

 ఇంట్లో సుగంధ మొక్కలను పెంచుకోవచ్చు. కొన్ని మొక్కలు దోమల నివారణ గుణాలను కలిగి ఉంటాయి. 

సిట్రోనెల్లా గడ్డి లేదా లెమన్‌గ్రాస్‌కు ప్రత్యేక సువాసన ఉంటుంది.  దీంతో  దోమలు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా పారిపోతాయి 

తులసి మొక్కను సూర్యరశ్మి సోకే ప్రదేశంలో పెంచవచ్చు. తులసి ఆకులను పిల్లల చర్మంపై రుద్దితే  దోమ కాటు నుండి ఉపశమనం పొందుతారు 

రోజ్‌మేరీ ఒక గొప్ప హెర్బ్ మాత్రమే కాదు అద్భుతమైన దోమల నివారిణి కూడా. ఇంట్లో పెంచుకుంటే గాఢత స్ట్రాంగ్‌ వాసనకు దోమలు దరిచేరవు 

పుదీనా సహజ దోమల నివారిణిగా పనిచేస్తుంది. వంటగదిలో చిన్న కుండీలో నాటితే మొక్క వాసనకి  దోమలు ఇంట్లోకి రావు 

జెరినియం మొక్క నిమ్మకాయ వాసన కలిగి ఉంటుంది. దీని సిట్రస్ సువాసన సహజంగా దోమలను తిప్పికొట్టడానికి సహాయపడుతుంది.