కళ్ల కింద నల్లటి వలయాలా? ఇలా మాయం చేయండి..

20 December 2023

కంప్యూటర్‌ స్క్రీన్‌ ముందు గంటల తరబడి పనిచేయడం, ఒత్తిడి, నిద్రలేమి..వంటి పలు కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి

చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఈ నల్లటి వలయాలను కొన్ని సహజ చిట్కాలతోనే తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు

నిద్రలేమి, అలసట, మొబైల్ ఎక్కువసేపు వాడడం, ఒత్తిడి, పోషకాహార లేమి, తగినన్ని నీళ్లు తీసుకోకపోవడం.. ఇలా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి

దీని వల్ల కళ్ల కింద చర్మం నల్లగా మారుతుంది. ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ.. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని కంటి సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉంది

పోషకాహారం తీసుకోవడంతో పాటు రోజూ కనీసం 7-8 గంటలు కంటి నిండా నిద్ర పోవాలి. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల వినియోగాన్ని తగ్గించి.. ధ్యానం, యోగాలను జీవనశైలిలో భాగం చేసుకోవాలి

అల్లం, తులసి, కుంకుమ పువ్వు... ఈ మూడింటితో తయారుచేసిన టీని రోజుకోసారైనా తాగాలి. రుచి కోసం తేనె కలుపుకోవచ్చు. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి

వేరుశెనగ, బెల్లం, కొబ్బరి... ఈ మూడింటిని కలిపి సాయంత్రం పూట కొద్దికొద్దిగా తింటుండాలి. ముఖాన్ని శుభ్రపరచుకోవడం కోసం సబ్బులు, ఫేస్‌వాష్‌ల వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి

పాలు, శెనగపిండిని కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకుని కళ్ల కింద నల్లటి వలయాలున్న చోట అప్లై చేసుకోవాలి. పాలలోని ‘ఎ’, ‘బి6’ విటమిన్లు చర్మంలోని మృత కణాలను తొలగించడంతో పాటు కొత్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఫలితంగా కళ్ల కింద నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి.