గర్బిణీలు బొప్పాయికి పూర్తిగా దూరం ఉండాలి. మరీ ముఖ్యంగా బొప్పాయి కాయను తీసుకుంటే ఇందులోని రబ్బరు పాలు సంకోచాలను ప్రేరేపిస్తాయి దంతో ముందుగానే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి.
గర్భిణీలు పైనాపిల్ తీసుకోకూడదు. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాశయాన్ని చాలా వరకు మృదువుగా మార్చుతుందని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ కూడా గర్భిణీలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇందులో అధికంగా ఉండే నీటిశాతం అధిక మూత్ర విసర్జనకు దారి తీస్తుంది.
గర్భందాల్చిన సమయంలో మామిడి పండ్లు కూడా మంచివి కావు. పండని మామిడి తీసుకుంటే గర్బాశయ సంకోచాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పనస పండు కూడా గర్భిణీలకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
అవకాడోలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కేలరీలు అధికంగా ఉండే అవాకాడో ఎక్కువగా తీసుకోవడం గర్భిణీలకు మంచిది కాదని చెబుతున్నారు.
ద్రాక్ష పండ్లు కూడా గర్భిణీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనం తవరకు ద్రాక్ష పండ్లకు గర్భిణీలు దూరంగా ఉండడమే ఉత్తమమని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.