25 May 2024

కాబోయే అమ్మలు..  ఇవి తింటున్నారా.? 

Narender.Vaitla

గర్భిణీలు చేపలు తీసుకుంటే మంచిదని చెబుతుంటారు. అయితే సముద్రపు చేపలకు దూరంగా ఉండాలి. పచ్చి చేపల్లో ఉండే బ్యాక్టీరియా కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఉంటుంది. 

కడుపుతో ఉన్న వారు చీజ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మహిళలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

గర్భిణీలు ఉడకబెట్టిన గుడ్డును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లో పచ్చి గుడ్డును మాత్రం తీసుకోకూడదు. వీటిలో ఉండే బ్యాక్టీరియా పలు సమస్యలకు దారి తీయొచ్చు. 

గర్భిణీలు నాన్‌ వెజ్‌ తీసుకుంటే మంచిదే కానీ ప్రాసెస్‌ చేసిన మాంసాహారం తీసుకోవడం వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు నెలలు నిండకుండానే పుట్టే అవకాశం ఉంది.

గర్భిణీలు కూరగాయలను తీసుకునే సమయంలో వాటిని శుభ్రంగా కడగాలి. ప్రస్తుతం కూరగాయలను రసాయనాలతో పండిస్తున్నారు. ఇవి గర్భిణీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. 

కెఫిన్‌ కంటెంట్ ఎక్కువగా ఉండే కాఫీలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మిస్‌ క్యారేజ్‌ అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో మద్యం జోలికి వెళ్లకుండా ఉండాలి. ఆల్కహాల్‌ కడుపులో ఎదుగుతున్న పిండంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.