19 July  2024

గర్భిణీలు..  ఈ పండ్లు తింటున్నారా.? 

Narender.Vaitla

గర్భిణీలు పుచ్చకాయకు దూరంగా ఉండడమే మంచిది. పుచ్చకాయంలో నీటిశాతం ఎక్కువగా ఉంటుది. దీంతో మూత్ర విసర్జన ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీయొచ్చు.

పనస పండు కూడా గర్భిణీలకు మంచిది కాదు. ఇందులో అధికంగా ఉండే ఫైబర్‌ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో కూడా మామిడి పండుకు దూరంగా ఉండడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భాశయ సంకోచాలకు కారణమయ్యే సమ్మేళనాలు ఉంటాయి.

పైనాపిల్‌ పండును కూడా మహిళలు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది సంకోచాలకు కారణం కావొచ్చు.

గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయికి దూరంగా ఉండాలని నిపుణులే కాకుండా పెద్దలు కూఆ చెబుతుంటారు. బొప్పాయి తీసుకుంటే అబార్షన్‌ కూడా అయ్యే అవకాశం ఉంటుంది.

గర్భం దాల్చిన సమయంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్బిణీలు ఈ సమయంలో చక్కెర ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండడం బెటర్‌.

గర్భిణీలు లిచీ పండుకు కూడా దూరంగా ఉండాలి. ఈ పండును తీసుకోవడం వల్ల రక్తస్రావం, కడుపు నొప్పి, పిండం క్షీణ‌త వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.