మహిళల్లో వృద్ధాప్యం త్వరగా రావడానికి కారణం ఇదే!

April 12, 2024

TV9 Telugu

మహిళలకు మాతృత్వం ఓ వరం. అమ్మవడమే ఆడజన్మకు సార్థకత అని భావించేవాళ్లు ఉన్నారు. కానీ అమ్మగా ఓ స్త్రీ ఎప్పుడైతే మారుతుందో.. తన ఆయుష్షును కూడా బిడ్డకు దారపోస్తుంది

అమ్మ అంతటి త్యాగమూర్తి మరి. కేవలం తల్లిగా మారడం వల్లనే మగవారికంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చి మహిళలు ముసిలి వాళ్లు అయిపోతుండటం జరుగుతున్నట్లు తాజా అధ్యాయనంలో వెల్లడైంది

న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మెయిల్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు మహిళల్లో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమవ్వడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు

వీరి పరిశోధనల్లో మహిళల పునరుత్పత్తి తర్వాత వస్తున్న డీఎన్‌ఏ మార్పులపై అధ్యయనం చేసి పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. డీఎన్‌ఏ మిథైలేషన్ నమునా ప్రక్రియలతో మహిళల జీవసంబంధమైన వయసును లెక్కించారు

ప్రతి గర్భం స్త్రీకి రెండు నుంచి మూడు నెలలు బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గర్భవతుల్లో జీవసంబంధమైన వృద్ధాప్యం ఎక్కువ పెరుగుదలను గుర్తించారు

గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని.. ఈ ప్రభావాలు అధిక సంతానోత్పత్తి కలిగిన స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కువ మంది పిల్లలను కన్న మహిళల్లో జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదల కనిపించిందట

అందువల్లనే పిల్లల్ని కన్న స్త్రీలు బిడ్డను మోయని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారట. ఇక ధూమపానం అలవాట్లు, సరైన పోషాకాలతో కూడిన ఆహారం తీసుకోలేని మహిళల్లో ఈ జీవసంబంధమైన వృద్ధాప్యం మరింత వేగవంతంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు

అయితే తండ్రులుగా ఉన్న పురుషుల్లో ఈ ప్రభావం లేదని, దీని ప్రభావం కేవలం గర్భం లేదా పాలిచ్చే తల్లుల్లో మాత్రమే జీవసంబంధమైన మార్పులు కనిపిస్తున్నట్లు గుర్తించారు. కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందట