చలికాలం శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాతావరణం చల్లబడడంతో శరీరంలోని హార్మోన్లపై ప్రభావం పడుతుంది. కొన్ని హార్మోన్లు హఠాత్తుగా పెరుగుతాయి.
హార్మోన్స్‌లో తేడాల వల్ల రక్తనాళాల్లో పేర్కొని కొవ్వు పగిలే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల రక్తప్రసారానికి అడ్డంకిగా మారవచ్చు. దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ ఆగే అవకాశం ఉంటుంది.
దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో ఆరోగ్యంలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వైద్యులను స్పందించాలి.
ఇక ఇంతకు ముందు గుండె జబ్బు బారిన పడినవారు చలికి వణుకు లేకుండా చూసుకోవాలి. వణుకు రావడం వల్ల హార్మోన్లలో హెచ్చుతగ్గులువస్తాయి.
చలికాలం రాగానే వెంటనే ఉన్ని దుస్తువులను ధరించాలి. చెవుల్లోకి గాలి వెళ్లకుండా ఉండేలా క్యాప్‌ను ధరించాలి. చలిలో ఎక్కువగా తిరగకూడదు.
ఇక ఆస్తమా, శ్వాస కోశ సమస్యలతో బాధపడేవారు వింటర్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల్లోకి సరిపడ గాలి అందకపోతే గుండెపై ఒత్తిడి పడుతుంది.
రక్తపోటు సమస్యతో బాధపడే వారు కూడా చలి కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
చలికాలంలో ఆహార పదార్థాలను వీలైనంత వరకు వేడి వేడిగా తీసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన వస్తువులు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.