బంగాళదుంపలు అతిగా తింటున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..
Jyothi Gadda
01 March 2025
అతిగా బంగాళాదుంప తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బరువు పెరగడం ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగే ఛాన్స్ ఉంది. బరువు తగ్గాలనుకునేవారు మితంగా తింటేనే మంచిది.
బంగాళాదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 78 కలిగి ఉంటుంది. కాబట్టి అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు అతిగా తినడం మంచిదికాదు.
మధుమేహం బాధితులు బంగాళదుంపలు ఎక్కువగా తింటూ ఉంటే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
బంగాళాదుంపలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఒక మధ్య తరహా ఆలూలో సుమారు 9 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి అతిగా తీసుకోవడం అనర్థం అంటున్నారు.
బంగాళదుంప అతిగా తినడం వల్ల స్ట్రోక్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే గుండె సమస్యలు దీన్ని తక్కువగా తినాలి.
బంగాళాదుంపలు పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల ఇతర పోషకాలపై దెబ్బపడే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొంతమందిలో బంగాళాదుంపలు అతిగా తినడం వల్ల గ్యాస్ట్రిక్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు కూడా దారీ తీసే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి పొట్ట సమస్యలు ఉన్నవారికి అనర్థం.