చాలామందికి రక్తం త్వరగా గడ్డకట్టదు. దీనికోసం మందులు వినియోగిస్తుంటారు. టమాటాల వల్ల రక్తం గడ్డకట్టేలా చేసే మందులకు హాని కలుగుతుంది.
రక్తం పలుచగా ఉండేవాళ్లు టమాటాలకు దూరంగా ఉంటే మంచిది. ఇక అందరికంటే ఎక్కువ జాగ్రత్త పడాల్సింది కిడ్నీ సమస్యలున్నవాళ్లు.
కిడ్నీలో రాళ్లుంటే టమాటా వంటి ఆక్సలేట్ స్టోన్స్ పదార్ధాలను తినకూడదు. ఎందుకంటే టమాటాల్లో ఉండే ఆక్సలేట్ అనే పదార్ధం కిడ్నీలో రాళ్లను పెరిగేలా చేస్తుంది.
ఇక అలర్జీ సమస్యలున్నా కూడా టమాటాకు దూరంగా పెట్టాల్సిందే. చాలామందికి కొన్ని రకాల పదార్ధాలంటే ఎలర్జీ ఉంటుంది. లేదా దగ్గు, రొంప అలర్జీ కారణంగా వస్తుంటుంది.