ఈ లక్షణాలు ఉంటే మీరు చాలా పాజిటివ్‌.. లేదంటే డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే

12 October 2024

TV9 Telugu

TV9 Telugu

ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ అది నిజ జీవితంలో సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఉండటం కష్టం

TV9 Telugu

జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినా మెదడులోకి చెడు ఆలోచనలు వస్తే మొత్తం ఆరోగ్యం నాశనం అవుతుంది. ఈ రోజుల్లో పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్లు చాలా అరుదు

TV9 Telugu

పైగా ‘ఒత్తిడి’ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. డిజిటల్‌ యుగంలో జీవన శైలి మార్పుతో మనిషి ఒత్తిడికి గురవుతున్నాడన్నది ఒప్పుకోవాల్సిందే

TV9 Telugu

అడపాదడపా ఒత్తిడితో సంభవిస్తున్న మరణాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అలాంటి మరణాల్లో ఎక్కువ గుండెపోటు బాధితులేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

స్ట్రెస్‌ తీవ్రమైతే ప్రాణాపాయానికి దారి తీస్తుంది. కడుపులో అల్సర్లు, తలనొప్పి, గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, చర్మవ్యాధులు, ఆస్తమా, ఒళ్లునొప్పులు, హార్మోన్ల అసమతుల్యం వంటి రుగ్మతలు వేధిస్తాయి

TV9 Telugu

అయితే మీరు పాజిటివ్ వ్యక్తా, నెగెటివ్‌ వ్యక్తా అన్నది.. ఒక చిన్న ట్రిక్‌ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. మీతో పిల్లలు త్వరగా కలిసిపోతే మీరు సానుకూల లక్షణాలను కలిగి ఉన్నారని అర్ధమన్నమాట

TV9 Telugu

వారికి సమస్య వచ్చినప్పుడు వారు ఆలోచించే మొదటి వ్యక్తి మీరే. మీకు ఉపశమనం లభిస్తే, మీరు సానుకూల వ్యక్తి.మీరు వచ్చిన వెంటనే గట్టిగా మాట్లాడే నిశ్శబ్ద వ్యక్తులు కూడా మీరు సానుకూల వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని అర్థం

TV9 Telugu

ఇష్టమైన క్రీడలు ఆడటం, పనిని బాధ్యతగా భావించాలి.. భారంగా భావించకపోవడం, ప్రకృతి ధర్మాన్ని పరిశీలిస్తుండటం, వారానికి నాలురోజులైనా వ్యాయామం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని చెమట పట్టిస్తే ఒత్తిడి హార్మోన్లు పనిచేసే తీవ్రత ఆటోమాటిగ్గా తగ్గుతుంది