పిస్తా మంచి నాస్తా.. అయితే వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే.. 

09 May 2024

TV9 Telugu

Pic credit - Pexels

పిస్తాపప్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొంచెం ఉప్పుగా డిఫరెంట్ రుచిని అందరూ ఇష్టపడతారు. పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే

పిస్తా మంచి నాస్తా 

ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, ఫైబర్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పిస్తాలో లభిస్తాయి

పోషకాలు మెండు 

పిస్తా తింటే కొందరికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయని సీనియర్ డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. ఏ వ్యక్తులు పిస్తాకు దూరంగా ఉండాలో చెప్పారు 

ఈ వ్యక్తులు తినకూడదు

జీర్ణ సమస్యలు ఉన్నవారు పిస్తాపప్పులను తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిని తినడం వల్ల అసిడిటీ, అజీర్ణం, కడుపునొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు వస్తాయి

జీర్ణ సమస్యలు

పిస్తాపప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని అధికంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.

బరువు పెరిగే ప్రమాదం 

అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా పిస్తాపప్పులకు దూరంగా ఉండాలి. పిస్తా అలెర్జీల స్థాయిని  ప్రేరేపించవచ్చ

అలర్జీ సమస్య 

పిస్తాపప్పులో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది బలహీనమైన వ్యక్తుల్లో మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

కిడ్నీల్లో రాళ్లు