బరువు తగ్గాలనుకునే వారికి కూడా పైనాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.
పైనాపిల్ విటమిన్ సికి పెట్టింది పేరు. దీంతో దీనిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ వచ్చే వ్యాధులకు చెక్ పెడుతుంది.
త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా ఉండాలంటే పైనాపిల్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం కాపాడుతాయి.
కడుపుబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను పైనాపిల్ దూరం చేస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పైనాపిల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని మాంగనీస్ చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుందని పరిశోధనల్లో తేలింది.
డయాబెటిస్ బాధితులకు కూడా పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
దంతాల ఆరోగ్యాన్ని కూడా పైనాపిల్ కాపాడుతుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో 73 శాతం మెగ్నీషియం లభిస్తుంది ఇది చిగుళ్ల, దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.