డార్విన్, ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్‌

14 October 2023

డార్విన్, ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలను సవాల్‌ చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌.

డార్విన్, ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయంటూ ప్రజా ప్రయోజన వాజ్యం వేసిన పిటిషనర్ రాజ్‌కుమార్.

ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు డార్విన్, ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాల అంశం రాదని తిరస్కరించిన సుప్రీంకోర్టు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్షత సమీకరణ సిద్ధాంతం E = mc² సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు పిటిషనర్.

మనిషి జీవన పరిణామానికి సంబంధించిన డార్విన్ సిద్ధాంతాన్ని సవాల్‌ చేస్తూ రాజ్‌కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.

స్కూల్‌, కాలేజీలో చదివిన డార్విన్, ఐన్‌స్టీన్‌ రెండు సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయంటూ పిల్‌లో పేర్కొన్న రాజ్‌కుమార్.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని పేర్కొన్న పిటిషనర్ రాజ్‌కుమార్.

రెండు సిద్ధాంతాలు తప్పని నిరూపించేందుకు అనుమతించాలని కోరగా సొంత థియరీని ప్రతిపాదించుకుని ప్రచారం చేసుకోవాలని పిటిషనర్‌కు సూచిస్తూ పిల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.