04 August 2024
TV9 Telugu
Pic credit - Social Media
కొంతమందికి పచ్చడి లేనిదే ముద్దకూడా దిగదు. దీంతో ఏడాదికి సరిపడా పచ్చళ్ళు అంటే ఆవకాయ, మాగాయి, టమాట వంటి రకరకాల పచ్చళ్ళు పట్టి ఉంచుకుంటారు.
పచ్చడిని ఆహారంలో కలుపుకుంటే రుచి రెట్టింపు అవుతుంది. కొంతమంది పచ్చళ్లు తినడానికి చాలా ఇష్టపడతారు, వారు ఖచ్చితంగా ఆహారంతో పచ్చళ్లు తింటారు.
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితం.. వంట చేసుకునే సమయం లేకపోతె అన్నంతో పాటు పచ్చళ్లను తిని ఆ రోజు గడిపేస్తున్నారు. ఇలా తింటే ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
అన్నంతో పాటు పరాటా, రోటీ వంటి వాటితో ఊరగాయను తినడం చాలా మందికి ఇష్టం. ఈ రెండు ఆహారాల కలయిక ఆహార పదార్ధాల రుచిని మరింత పెంచుతుంది.
వర్షాకాలంలో ఊరగాయలను ఎక్కువగా తినడం మానుకోవాలని డైటీషియన్ ప్రియా మెహ్రా అంటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది
ఊరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఈ కారణంగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది
రోజూ పచ్చళ్లను తీసుకుంటే పొట్టలో ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఊరగాయను ఎక్కువగా తినడం వల్ల కడుపులో అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ఊరగాయలలో సోడియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం కాల్షియాన్ని సరిగా గ్రహించదు. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి
ఊరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఊరగాయను తినే విషయంలో పరిమితి పాటించండి.