పీరియడ్స్ సమయంలో మహిళల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో ముఖం నిండా మొటిమలు వస్తాయి. ఈ సమస్యను ఎలా నివారించాలంటే
TV9 Telugu
పీరియడ్స్ వల్ల మొటిమలు వస్తే ఆ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. తగినంత నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటారు. తద్వారా మొటిమలను తగ్గిస్తుంది
TV9 Telugu
జిడ్డు చర్మం ఉన్నవారిలో మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సరైన ఫేస్ వాష్ ఉపయోగించడం అవసరం. సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్‌తో ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోవాలి
TV9 Telugu
మొటిమలను పదే పదే గిల్లకూడదు. మొటిమలను గిల్లడం వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గకపోగా, సమస్య మరింత పెరుగుతుంది
TV9 Telugu
పీరియడ్స్ సమయంలో నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, స్వీట్లు తినడం నివారించాలి
TV9 Telugu
రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గింజలు తీసుకోవాలి. ఈ రకమైన ఆహారం రుతుక్రమానికి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుంది
TV9 Telugu
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే పీరియడ్స్ సమయంలో తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యత, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మం కూడా బాగుంటుంది
TV9 Telugu
మీకు PCOD లేదా PCOSతో సమస్యలు ఉంటే, మొటిమలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమస్య ఉంటే, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి