శరీరంలోని ఈ భాగాలపై ఎప్పుడూ పెర్ఫ్యూమ్ వాడకూడదు..!
TV9 Telugu
25 July 2024
ఈ రోజుల్లో చాలామంది ప్రజలు పెర్ఫ్యూమ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఫ్యాషన్‌లో ఒక భాగంగా మారిపోయింది.
ప్రతి ఒక్కరూ మంచి వాసన కోసం పెర్ఫ్యూమ్ ఉపయోగిస్తుంటారు. వీటి ధర గురించి కూడా ఆలోచించకుండా ఎంతైన కొంటున్నారు.
కళ్ల చుట్టూ ఉండే చర్మం అంత కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి కళ్ల చుట్టూ పెర్ఫ్యూమ్ అస్సలు వాడకూడదు.
అండర్ ఆర్మ్స్‌లో పెర్ఫ్యూమ్‌ను పూయడం మానుకోండి. ఎందుకంటే దీనివల్ల చర్మం నల్లబడటం, దద్దుర్లు వస్తుంటాయి.
పెర్ఫ్యూమ్‌లోని రసాయనాలు చెవి లోపల చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, చెవి చుట్టూ పెర్ఫ్యూమ్ రాయవద్దు.
పెర్ఫ్యూమ్‌లలో తయారీలో ఆల్కహాల్ తో పాటు శరీరంలోని సున్నితమైన భాగాలను దెబ్బతీసే హానికరమైన రసాయనాలు వాడుతారు.
మీరు మణికట్టు, మెడ, ఛాతీ వంటి ప్రాంతాల్లో పెర్ఫ్యూమ్ అప్లై చేయవచ్చు. ఈ భాగాల దగ్గర పూయడం వల్ల సువాసన వ్యాప్తి చెంది గంటల తరబడి ఉంటుంది.
పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు ఉండేలా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి. హైడ్రేటెడ్ స్కిన్‌పై మాయిశ్చరైజర్‌ను అప్లై చేస్తే పెర్ఫ్యూమ్ గంటల తరబడి ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి