18 September 2024
TV9 Telugu
Pic credit - Pexels
వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఒకోక్కసారి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయలో ఉండే పోషకాలు వారి శరీరంపై ప్రతికూల ఫలితాలను చూపిస్తాయి.
ఫుడ్ అలెర్జీ ఉన్నట్లయితే, వంకాయ తింటే అలర్జీ సమస్య మరింత తీవ్రమవుతుంది. వంకాయని దూరంగా పెడితే మీకు అలర్జీ సమస్యలు దూరం అవుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
కళ్లలో ఏదైనా సమస్య ఉంటే వంకాయకు దూరంగా ఉండాలి. కళ్లలో మంట, వాపు, దురద వంటి సమస్యలున్నవారు వంకాయ తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
డిప్రెషన్ తో లేదా ఆందోళనతో బాధపడుతుంటే వంకాయ తినడం మంచిది కాది. ఇది రోగులలో డిప్రెషన్ మరింత పెంచుతుంది. అంతేకాదు మందులు పని చేసే తీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది.
మూలశంక సమస్యలతో ఇబ్బంది పడేవారు వంకాయను తినొద్దు. దీనిని తినడం వలన ఫైల్స్ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు
శరీరంలో రక్తం స్థాయి తక్కువగా ఉంటే వంకాయకు దూరంగా ఉండడం మేలు. వంకాయలోని సమ్మేళనాలు శరీరంలో రక్తం వృద్ధికి అడ్డంకిగా పనిచేస్తాయి. అందుకనే రక్తహీనత ఉన్నవారు వంకాయ తినొద్దు.
ఎవరైనా కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతుంటే వంకాయను అస్సలు తినొద్దు. వంకాయలో ఉండే ఆక్సలేట్స్ రాళ్ల సమస్యను మరింత తీవ్రం చేస్తుందట