29 November 2024
Pic credit - Getty
TV9 Telugu
సీతాఫలం మంచి రుచితో పాటు అనేక ఔషధగుణాలు ఉంటాయి. ఆకులు, బెరడు, గింజలు, వేరు ఇలా ప్రతి భాగం అనేక రకాల ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తారు.
ఎన్నో పోషకాలున్నా ఈ సీతాఫలాన్ని కొంతమంది తినకూడదు. ఒకవేళ తిన్నా చాలా తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినొద్దు అంటే
డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్న వారు సీతాఫలాలు తినొద్దు. చెక్కెర స్థాయి పెరుగుతుంది. అంతేకాదు దీనిలో ఉన్న ఫ్రక్టోజ్ షుగర్ పేషెంట్స్ కు మంచిది కాదు.
ఇన్సులిన్ ఉపయోగించే షుగర్ పేషెంట్స్ సీతాఫలాలను తినాలనుకుంటే 15 రోజులకు ఒకటి మాత్రమే తింటే మంచిదని సలహా ఇస్తున్నారు.
దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు సీతాఫలాలు తినే ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. కనుక ఈ సీజన్ లో జలుబు, దగ్గుతో బాధపడే వారు సీతాఫలాలు తినొద్దు
సీతాఫలాలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలల బారిన పడతారు. కొందరికి విరోచన సమస్యలు కూడా తలెత్తవచ్చు.
సీతాఫలాలు తింటే కొందరికి శరీరం పైన దురద, ఎర్రటి దద్దుర్లు వంటి చర్మ సమస్యల బారిన పడతారు. వీరు తినొద్దు అని చెబుతున్నారు.
గర్భిణీలు కూడా సీతాఫలాలను తక్కువ తింటే మంచిదని సూచిస్తున్నారు. పొరబాటున విత్తనాలు మింగితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.