30 October 2024
TV9 Telugu
Pic credit - Getty
నెయ్యి ఆరోగ్యానికి మంచిది. రోజూ ఒక స్పూన్ అయినా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు.
పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే నెయ్యిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదట.
లివర్ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా నెయ్యిని తీసుకోకూడదట. లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు నెయ్యి తింటే జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.
తిన్న ఆహారం జీర్ణం అవడంలో సమస్యలు ఉంటే.. నెయ్యిని తినొద్దు. లేదంటే మలబద్దకం, గ్యాస్ తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
నెయ్యిలో కొలిస్ట్రాల్ చాలా అధికంగా ఉంటుంది కనుక గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది.
నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సమస్య ఉన్నవారు తినడం వలన హార్ట్ ఫెయిల్యూర్ కి కారణం అయ్యే ప్రమాదం ఉంది.
అధిక బరువు సమస్యలతో బాధడుతున్న వారు బరువు తగ్గాలని భావించే వారు నెయ్యికి దూరంగా ఉండడం మంచిది.
మొటిమల సమస్యతో ఇబ్బంది పెడుతుంటే వారు నెయ్యికి దూరంగా ఉండడం మంచిది.