ఈ రాశివారు ముత్యాలు ధరిస్తే దశ మెరిసిపోవటం ఖాయం..!
Jyothi Gadda
07 December 2024
TV9 Telugu
జోతిష్యశాస్త్రంలో ప్రతి రత్నానికీ ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు..ఒక్కో రత్నానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. నవరత్నాలలో ఒకటైన ముత్యం ప్రత్యేకత తెలిస్తే..
TV9 Telugu
కొన్ని రాశులవారు ముత్యం ధరించడం వల్ల జీవితంలో ఊహించని మార్పులు వస్తాయట. ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని, వారికి జీవితంలో సంతోషం లభిస్తుందని చెబుతారు.
TV9 Telugu
వృషభ రాశి వారికి ముత్యాలు ధరించడం చాలా శుభప్రదం అంటున్నారు నిపుణులు. ముత్యం వారి జీవితంలో స్థిరత్వం, ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతున్నారు.
TV9 Telugu
వృషభ రాశివారిలో ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. ఒత్తిడి లేకుండా... మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
TV9 Telugu
తుల రాశివారికి కూడా ముత్యం ధరించడం వల్ల కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.
TV9 Telugu
తులారాశి వారిలో ఒత్తిడి తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, సమాజంలో ఖ్యాతిని పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. సామాజిక జీవితాన్ని కూడా సుసంపన్నం చేస్తుంది.
TV9 Telugu
జ్యోతిషశాస్త్రం ప్రకారం, కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తాడు. కాబట్టి ఈ రాశివారు ముత్యాలు ధరిస్తే.. వారికి చాలా మేలు జరుగుతుంది. ముత్యాలను చంద్రుని రత్నంగా పరిగణిస్తారు.
TV9 Telugu
చంద్రుని ప్రభావం కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా , దృఢ సంకల్పంతో ఎదుర్కొనేలా చేస్తుంది.