ధర ఎక్కువైనా.. ఈ పండ్లు తప్పక తినండి 

Narender Vaitla

23 November 2024

గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే పియర్‌ పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే కచ్చితంగా పియర్‌ ఫ్రూట్‌ను తీసుకోవాలి. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.

డయాబెటిస్‌ పేషెంట్స్‌కు కూడా పియర్‌ ఫ్రూట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ రక్తంలో చక్కెర స్తాయిలను నియంత్రణంలో ఉంచుతాయి.

పియర్‌ పండులో పొటాషియం కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంచుతుంది.

తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే పియర్‌ ఫ్రూట్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పియర్‌ పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌ సైతం పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కణాలను పెరగకుండా చేస్తుంది. కాబట్టి క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే పియర్‌ పండును తీసుకోవాలి.

పియర్‌ పండులో ఫైబర్‌ కంటెంట్‌ సైతం పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.