పియర్‌ పండు తింటే దీర్ఘకాలం పాటు జీవిస్తారట..!

Jyothi Gadda

12 May 2024

పియర్ ఫ్రూట్ తీయగా ఉండటమే కాకుండా ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే డైటరీ ఫైబర్, బరువు పెరగకుండా కాపాడుతుంది. జీర్ణ ఆరోగ్యానికి మంచిది. పియర్ పండులో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. 

ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మ ఆరోగ్యానికి ఇమ్యూనిటీ వ్యవస్థకు ఎంతో అవసరం. డియర్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది  ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తుంది.

పియర్ ఫ్రూట్ మంచి హెల్దీ స్నాక్. దీని మీ డైట్లో చేర్చుకుంటే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో న్యాచురల్ షుగర్ ఉంటుంది. ఎన్నో పోషకాలు ఉండే ఈ పియర్ పండులో మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచే శక్తి ఉంటుంది. 

పియర్ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోనే యాంటీ క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ నువ్వు కారణాలను పెరగకుండా కాపాడుతుంది. కడుపు క్యాన్సర్ లంగ్ కేన్సర్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.

పియర్ పండును తీసుకోవడం వల్ల మన శరీరంలో పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది. ప్రతిరోజు క్యాల్షియం అందినట్టు అవుతుంది. దీంతో ఆస్ట్రోపోరోసిస్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 

పియర్ ఫ్రూట్, కూరగాయలు కలిపి తీసుకోవడం వల్ల ఎముకలకు మంచిది. పియర్ ఫ్రూట్లో బోరెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియంని త్వరగా గ్రహిస్తుంది. పీహెచ్ స్థాయిలను నిర్వహిస్తుంది. షుగర్‌ కంట్రోల్‌ చేస్తుంది.

పియర్ ఆంథోసైనిన్ కంటెంట్ ఉంటుంది. టైప్ టు డయాబెటిస్ ని తగ్గిస్తుంది ఇందులో గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ వారు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయం లేదు.

పియర్ పండులో పోలిక్ యాసిడ్ ఉంటుంది. గర్భిణీలకు మంచిది. నాచురల్ గా పోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల గర్బస్రావం కాకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లైవనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి సెల్ డామేజ్ కాకుండా కాపాడతాయి.