వేరుశనగ ఆరోగ్యానికి మంచిదే.. వీటితో తింటే విషంతో సమానం.. 

10 December 2024

Pic credit - Getty

TV9 Telugu

వేరుశెనగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, బి1, బి3, ప్రొటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

 వేరుశనగ

వేరుశెనగ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం..అయినా వాటిని కొన్ని వస్తువులతో తినకూడదు. ఇలా తింటే కడుపు సంబంధిత సమస్యలు సంభవించవచ్చు.  

 వీటితో తినవద్దు

 వేరుశెనగ, పాలు కలయిక జీర్ణవ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది. గ్యాస్ , కడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడవచ్చు

 పాలు

 వేరుశెనగ, బంగాళాదుంపలను కలిపి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది.

బంగాళదుంప

నారింజ, నిమ్మ లేదా ద్రాక్ష వంటి పుల్లని పండ్లు వేరుశెనగతో కలిపి తినకూడదు. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో మంట లేదా కడుపు బరువుగా అనిపించవచ్చు.

సిట్రస్ పండ్లు

 వేరుశెనగతో అధికంగా బెల్లం తీసుకోవడం వల్ల కడుపులో వేడి పెరుగుతుంది. ఇది కడుపు నొప్పి లేదా మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది.

 బెల్లం

వేరుశెనగతో టీ లేదా కాఫీ తాగకూడదు. టీ , కాఫీలో టానిన్ మూలకం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

 టీ, కాఫీ