పతంగుల వేళ..పిల్లలు జాగ్రత్త
TV9 Telugu
11 January 2024
తెలుగువారు పెద్ద పండగగా భావించే సంక్రాంతి దగ్గర పడింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో ఈ పండగను ఘనంగా చేస్తారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తల్లిదండ్రులు పతంగులు ఎగురవేసే సమయంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ లో తల్లిదండ్రులకు సూచించారు.
జనవరి 14, 15వ తేదీలో నగరంలో సంకాంత్రి వేడుకలు జరుగనుండడంతో ప్రార్థనాలయాల పరిసరాలలో పతంగులు ఎగురవేయవద్దని సీపీ నిషేధాజ్ఞలు విధించారు.
అలాగే పోలీసుల అనుమతి లేకుండా స్పీకర్లు, డీజేలు ఏర్పాటు చేసుకోవద్దని అన్నారు. అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం అన్నారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌లు ఉపయోగించవద్దని తెలిపారు.
దీనిపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని అన్నారు. ఉల్లంగిస్తే భారీ మూల్యం తప్పదని ప్రజలను హెచ్చరించారు.
ప్రశాంతతకు భంగం కలిగించకుండా ప్రతి ఒక్కరూ కూడా పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సీపీ నగర ప్రజలను కోరారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి