26 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి పనీర్ ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతీయుల వంటల్లో ఉపయోగించే అతి సాధారణ పాలవిరుగుడు.
శాఖాహారులు తమ ఆహారంలో చీజ్ అంటే పనీర్ చేర్చుకుంటారు. పనీర్ తో చేసిన ఆహారాన్ని ఇష్టంగా తింటారు. అయితే కొందరు దీనిని తినకూడదు.
చెడు కొలెస్ట్రాల్ శరీరానికి హాని కలిగిస్తుంది. కనుక ఎవరైనా చెడు కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే చీజ్ తినకుండా ఉండాలి.
పనీర్‌లో సోడియం కూడా ఉంటుంది. సోడియం ఎక్కువగా శరీరంలోకి చేరితే అది హైబీపీ సమస్యను మరింత పెంచుతుంది.
ఊబకాయం సమస్య ఉన్నవారు పనీర్ కు తినడం మానుకోండి. ఎందుకంటే చీజ్‌లో అధికంగా కొవ్వు ఉంటుంది. ఇది ఊబకాయాన్ని మరింత పెంచుతుంది.
ఎవరైనా యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. ఈ సమస్య ఉన్నవారు పనీర్ ను తినకూడదు. చీజ్ ప్యూరిన్‌లను పెంచుతుంది.
తినే ఆహారంలో ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే... అది యూరిక్ యాసిడ్‌ను పెంచుతుంది.పనీర్ లో కూడా ఈ గుణం ఉంది కనుక యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది.
పనీర్‌లో లాక్టోస్ అధికంగా ఉంటుంది. ఎవరైనా సరే దీన్ని ఎక్కువగా తింటే గ్యాస్, ఉబ్బరం కలిగిస్తుంది. లాక్టోస్ అసహనం ఉన్న వ్యక్తులు ముఖ్యంగా ఈ సమస్యల బారిన పడతారు.