మీకు పన్నీర్‌ తినే అలవాటు ఉందా.? 

Narender Vaitla

10 Aug 2024

రొమ్ము క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో పన్నీర్ కీలక పాత్ర పోషిస్తుంది. పన్నీర్‌లో ఉండే యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్స్‌ క్యాన్సర్‌ కణాలను దెబ్బ తీస్తుంది.

పన్నీర్ ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. పన్నీర్‌లో మెగ్నీషియం కంటెంట్‌ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

క్యాల్షియంకు పెట్టింది పేరైన పన్నీర్‌ను తీసుకోవడంవల్ల ఎముకలు ధృడంగా మారుతాయి. మోకాళ్ల నొప్పలకు వీటితో చెక్‌ పెట్టొచ్చు.

మెరుగైన జీర్ణక్రియకు పన్నీర్‌ దివ్యౌషధంగా చెప్పొచ్చు. ఇందులోని ఫాస్పర్‌, ఫాస్పేట్‌ జీర్ణ సంబంధిత రోగాలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.

రోగనిరోధ శక్తి పెంచడంలో కూడా పన్నీర్‌ ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే జింక్‌ కంటెంట్‌ వ్యాధులు రాకుండా అడ్డకుటంటాయి. 

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పన్నీర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రేచీకటి, కంటి సమస్యలు దూరమవుతాయి.

అధిక రక్తపోటు సమస్యకు కూడా పన్నీర్‌ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం కంటెంట్‌ బీపీని కంట్రోల్ చేస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.